Tension In Eluru: ఫోటోల కలకలం.. కుప్పకూలిన కాపురం.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Sep 18 , 2025 | 09:56 AM
గ్రామానికి చెందిన ఓ వివాహితను అదే గ్రామంలోని ఓ యువకుడు గత కొన్ని రోజులుగా ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపించి వేధిస్తున్నాడు. అయితే దీనిని వివాహిత పట్టించుకోలేదు.
ఏలూరు జిల్లా, సెప్టెంబర్ 18: జిల్లాలోని నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు చేసిన నిర్వాకంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. వివాహిత కాపురం కుప్పకూలింది. చివరకు సదరు యువకుడిని గ్రామాస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. కానీ బలవన్మరణానికి పాల్పడిన వ్యక్తి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
గ్రామానికి చెందిన ఓ వివాహితను అదే గ్రామంలోని ఓ యువకుడు గత కొన్ని రోజులుగా ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపించి వేధిస్తున్నాడు. అయితే దీనిని వివాహిత పట్టించుకోలేదు. వివాహిత స్పందించకపోవడంతో రెచ్చిపోయిన సదరు యువకుడు ఆమె కాపురాన్ని కూల్చేపని చేశారు. మహిళ భర్తకు తమ పాత పరిచయపు ఫోటోలు పంపించి పైశాచిక ఆనందం పొందాడు యువకుడు సురేష్. ఫోన్లో ఫోటోలు చూసిన భర్త.. వివాహితను, ఇద్దరు పిల్లలను పుట్టింటి వద్ద దించి వెళ్ళిపోయాడు. ఈ ఉదంతం గ్రామంలో తెలియడంతో యువకుడు సురేష్‌ను వివాహిత కుటుంబసభ్యులు, బంధువులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా.. గ్రామంలో కుమార్తె కాపురంపై వస్తున్న పలు ఆరోపణలతో అవమానం భరించలేక వివాహిత తండ్రి బెజవాడ శ్రీనివాసరావు పురుగులమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే తండ్రి శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఉండేందుగా భారీగా మోహరించారు. మరోవైపు ఇరు సామాజిక వర్గాల మధ్య నెలకొన్న వివాదానికి కొందరు గ్రామ పార్టీ నాయకులు రాజకీయ రంగులు పులుమి రెచ్చగొడుతున్న పరిస్థితి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ గ్రామస్థుల్లో నెలకొంది.
ఇవి కూడా చదవండి..
జగన్ చెంప పగలగొట్టాలి.. అచ్చెన్న ఫైర్
మాజీ ముఖ్యమంత్రులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..
Read Latest AP News And Telugu News