50 Age Pension Scheme: పెన్షన్‌లు తొలగించలేదు.. ప్రచారాలు మానండి.. వైసీపీపై మంత్రి ఫైర్
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:53 PM
పెన్షన్‌లను 200 నుంచి వెయ్యి రూపాయలు చేసినా, ఆ తర్వాత నాలుగు వేలు చేసినా, 15 వేల వరకు పెన్షన్ అందిస్తోన్న ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అని మంత్రి కొండపల్లి చెప్పుకొచ్చారు.
అమరావతి, సెప్టెంబర్ 18: ఏపీ శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో 50 ఏళ్లకు పింఛన్ పథకంపై చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) సమాధానం ఇచ్చారు. 50-59 వయసు మధ్య ఉన్నవారు 11,98,501 మంది పింఛన్ పొందుతున్నారని.. ప్రతి నెలా ఒకటో తేదీన పేదలకు పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. వృద్ధులకు ఇచ్చే పింఛన్లను 3 వేల నుంచి 4 వేలకు ఒకేసారి పెంచామని... అర్హులకు ఎక్కడా పింఛన్లు తొలగించలేదని స్పష్టం చేశారు. పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే భార్యకు స్పౌజ్ పెన్షన్ అందిస్తున్నామన్నారు. పెన్షన్‌లను 200 నుంచి వెయ్యి రూపాయలు చేసినా, ఆ తర్వాత నాలుగు వేలు చేసినా, 15 వేల వరకు పెన్షన్ అందిస్తోన్న ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అని మంత్రి చెప్పుకొచ్చారు.
50 ఏళ్ళు పైబడిన వారకి పెన్షన్‌లకు పంపిణీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని తెలిపారు. నవంబర్ 2024 నుంచి ప్రతినెలా స్పౌజ్ పెన్షన్స్ మంజూరు చేస్తున్నామని అన్నారు. 50-59 వయసు మధ్య ఉన్నవారు 11,98,501 మంది పింఛన్ పొందుతున్నారని..పెన్షన్‌లు పెంచుకుంటూ పోతామని మాయ మాటలు చెప్పలేదన్నారు. అత్యవసర పరిస్థితిలో ఊరు దాటి వెళ్ళిన వాళ్లకు మూడు నెలలు సమయం ఇచ్చామని.. ఈ విధంగా లబ్ది పొందిన వారు 11,98,501 మంది అని తెలిపారు. అర్హులకు ఎక్కడా పెన్షన్‌లను తొలగించలేదని, ప్రతీ అర్హుడికి ఈ ప్రభుత్వంలో పెన్షన్ అందుతుందని స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు 50 సంవత్సరాల వయస్సు వారికి ఫించన్ మంజూరు చేశామన్నారు. ఆదివాసి గిరిజనులకు, కల్లు గీత కార్మికులకు పెన్షన్‌లను మంజూరు చేస్తున్నామని మంత్రి కొండపల్లి చెప్పారు.
పెన్షన్‌ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవుపలికారు. మూడు వేల పెన్షన్‌ను 5 వేలు పెంచారని, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల పెంచిన పెన్షన్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో డయాలసిస్ (dialysis) చేయించుకుంటున్న వారికి వయస్సుతో సంబంధం లేకుండా పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
తొలిసారి మండలికి నాగబాబు.. పవన్ దిశానిర్దేశం]
రైతులు నమ్మారు.. భూములు ఇచ్చారు.. కరేడు ల్యాండ్స్‌పై మంత్రి అనగాని
Read Latest AP News And Telugu News