Share News

Chittoor Husband Attacks Wife: కుప్పంలో దారుణం.. భార్యపై అతికిరాతకంగా కత్తితో దాడి..

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:39 PM

కుప్పం మండలం బైరప్ప కొట్టాలలో భార్యను అతికిరాతకంగా కత్తితో నరికాడు ఓ భర్త. బైరప్ప కొట్టాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె సమీపంలోని తీర్థం గ్రామానికి చెందిన రాజేష్‌కు సుమారు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది.

Chittoor Husband Attacks Wife: కుప్పంలో దారుణం.. భార్యపై అతికిరాతకంగా కత్తితో దాడి..

చిత్తూరు: మానవత్వం మరిచి మనిషి మృగంలా మారి దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు తరుచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆలోచన ధోరణిని మరిచి క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకు బలి అవుతున్నారు. కొందరు అయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలుపాలు అవుతున్నారు. ఎందుకు చేస్తున్నామో.. దేనికోసం చేస్తున్నామో కూడా తెలియకుండా ఆవేశంలో ప్రాణాలను హరిస్తున్నారు. ఓ మనిషి మృగంలా మారి భార్యను అతికిరాతకంగా నరికిన ఘటన కుప్పం మండలంలో వెలుగు చూసింది.


కుప్పం మండలం బైరప్ప కొట్టాలలో భార్యను అతికిరాతకంగా కత్తితో నరికాడు ఓ భర్త. వివరాల్లోకి వెళితే.. బైరప్ప కొట్టాలు గ్రామానికి చెందిన కీర్తనకు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె సమీపంలోని తీర్థం గ్రామానికి చెందిన రాజేష్‌కు సుమారు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన కీర్తన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూడటానికి వచ్చిన రాజేష్.. ఒక్కసారిగా కత్తితో కీర్తనపై అతికిరాతకంగా దాడికి పాల్పడ్డాడు.

దీని గమనించిన స్థానికులు అరుపులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. అనంతరం సమీపంలోని ఓ ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు రాజేష్‌ను పట్టుకుని చెట్టుకు కట్టి వేశారు. హుటాహుటిన కీర్తనను కుప్పం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

Updated Date - Sep 18 , 2025 | 02:04 PM