AP News: హిందూపురంలో.. కుక్కలున్నాయ్ జాగ్రత..
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:50 PM
ఇటీవల పట్టణంలో ఎటుచూసిన గ్రామసింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి పై చిత్రమే నిదర్శనం. ఒక టో రెండో కాదు పదుల సంఖ్యలో ఒకేచోట చేరుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే పాదచారులు లేదా ద్విచక్రవాహన చోదకుల వెంటపడి దాడిచేస్తున్నాయి.
- పురంలో ఎటుచూసినా వీధికుక్కలే..
- పశువులతో ప్రజల పాట్లు
- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
హిందూపురం: ఇటీవల పట్టణంలో ఎటుచూసిన గ్రామసింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏస్థాయిలో ఉన్నాయో చెప్పడానికి పై చిత్రమే నిదర్శనం. ఒక టో రెండో కాదు పదుల సంఖ్యలో ఒకేచోట చేరుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే పాదచారులు లేదా ద్విచక్రవాహన చోదకుల వెంటపడి దాడిచేస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదాలుకూడా జరుగుతున్నాయి. వీధులవెంట నడుచుకుని వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు.

సాయంత్రం 6 దాటితే రోడ్డుపై రావడానికే భయపడే పరిస్థితి దాపురించింది. ఇక మాంసం దుకాణాలు, డాబాలు, హోటళ్లవద్ద గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. దీనివల్ల రోడ్డుపైకెక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి వీటిని నియంత్రించాలంటూ పట్టణ ప్రజలు కోరుతున్నారు.

గుంపులుగా పశువులు
పట్టణంలో రాత్రింపగళ్లు పశువులు రోడ్డుపై గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. దీనివల్ల పలుసార్లు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటీవల పెనుకొండ రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని కిందకు తోసేయగా తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా రోడ్డుపక్కన నడుచుకుని వెళ్తున్న వ్యక్తిని కొమ్ములతో పొడవగా ఆసుపత్రిపాలయ్యాడు. పలువురు వీటిని తప్పించే క్రమంలో కిందపడి గాయపడిన సంఘటనలు కోకొల్లలు. పశువులను రోడ్డుపైకి వదలడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఏ నగరాల్లో ఎలా ఉన్నాయంటే
Read Latest Telangana News and National News