Share News

Minister Lokesh ON Marshals: ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:30 PM

ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంబర్‌ నుంచి మంత్రి లోకేష్‌ బయటకు వస్తున్న సమయంలో లాబీల్లో ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్‌ హడావుడి చేశారు.

Minister Lokesh ON Marshals: ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్‌ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం
Minister Lokesh ON Marshals

అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) లాబీల్లో మార్షల్స్‌ అతి ప్రవర్తనపై (Marshals Misbehavior) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంబర్‌ నుంచి మంత్రి లోకేష్‌ బయటకు వస్తున్న సమయంలో.. లాబీల్లో ఇతరులను తప్పుకోండి అంటూ మార్షల్స్‌ హడావుడి చేశారు.


సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని అంటూ మంత్రి లోకేష్‌ వారిని ప్రశ్నించారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్‌ (Tadepalli Palace) పాలనలో ఉన్నామనుకుంటున్నారా? అంటూ చురకలు అంటించారు. బయటి వ్యక్తులు లోపలకు రాకుండా చూసుకోవాలి కానీ.. ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని మార్షల్స్‌కు లోకేష్‌ హితవు పలికారు.


కాగా, ఇవాళ(గురువారం) ఉదయం తొమ్మిది గంటలకు ఏపీ అసెంబ్లీ, పది గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి వచ్చే ముందు వెంకటపాలెంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), టీడీపీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. కార్మిక, పరిశ్రమలు, మోటార్ వాహనాలు, ఎస్టీలకు సంబంధించి అసెంబ్లీలో 8 చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీలో చర్చించేందుకు 22 అంశాలను సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం.


ఇవి కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

రైతులు నమ్మారు.. భూములు ఇచ్చారు.. కరేడు ల్యాండ్స్‌పై మంత్రి అనగాని

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 18 , 2025 | 05:55 PM