ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు.. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:48 AM
అక్వాన్ తీవ్ర తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో గురువారం మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా మారిందని తెలిపారు.
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అక్వాన్ తీవ్ర తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో ఈరోజు (గురువారం) మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా మారిందని తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 470 కిలోమీటర్లు, కళింగపట్నానికి 490 కిలోమీటర్లు, చెన్నైకి 570 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కి 580 కిలోమీటర్లు, పూరీకి 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వివరించారు.
ఇది రేపు (శుక్రవారం) మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ ప్రాంతాల మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. దీని ప్రభావంతో నేడు (గురువారం), రేపు (శుక్రవారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ వేళ.. బాలయ్య ప్రశంసలు.!
ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. 145 కి.మీ వేగంతో బలమైన గాలులు..!
పంచాయతీ ఎన్నికలు.. ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిఘా పెట్టిన పోలీసులు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News