పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:35 AM
మూడో విడత పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
హుజూరాబాద్/జమ్మికుంట/ఇల్లందకుంట, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మూడో విడత పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇల్లందకుంట మండలంలోని సీతా రామచంద్రస్వామి దేవాలయ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఎన్నికల సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలన్నారు. నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి నివేదికలు పంపించా లని ఆదేశించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలన్నారు. చివరి దశ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రమేష్‌బాబు ఉన్నారు.