Share News

అక్వాన్ తుపాను ప్రభావం.. నెల్లూరు జిల్లాలో 200 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:51 AM

దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను ప్రభావంపై మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

 అక్వాన్ తుపాను ప్రభావం.. నెల్లూరు జిల్లాలో 200 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
Cyclone Aqwan Latest Update

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను ప్రభావంపై ఈరోజు (మంగళవారం) ఆయన ప్రకటన విడుదల చేశారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3కిలోమీటర్ల వేగంతో తుపాను కదలిందని తెలిపారు. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతానికి చెన్నైకు 610కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


నెల్లూరు జిల్లా సముద్రంలో గంట గంటకు అలల ఉధృతి..

నెల్లూరు జిల్లాలో అక్వాన్ తుపానుతో సముద్రంలో గంట గంటకు అలల ఉధృతి పెరుగుతోంది. పలుచోట్ల 50మీటర్ల నుంచి 200 మీటర్ల ముందుకు సముద్రం వచ్చింది. ఈ క్రమంలోనే సముద్రంలో చేపలవేటను అధికారులు నిలిపివేశారు. జువ్వలదిన్నె హార్బర్‌లో 80కు పైగా మరబోట్లు నిలిచిపోయాయి. తుపాను ప్రభావంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పటిష్ఠమైన చర్యలు‌ తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సోమశిల, కండలేరు డ్యామ్‌లు నిండాలని ప్రజలు కోరుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 12:49 PM