వరంగల్, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:20 AM
కాన్పూర్ సెంట్రల్- మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సెప్టెంబర్ 2 నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.
సెప్టెంబరు 2 నుంచి నవంబరు 28 వరకు సేవలు
వరంగల్: కాన్పూర్ సెంట్రల్- మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సెప్టెంబర్ 2 నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్- మధురై మధ్య నడుస్తాయి. కాన్పూర్ సెంట్రల్ - మధురై (01925) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 25 వరకు ప్రతీ బుధవారం ఉదయం 8.10 గంటలకు కాన్పూర్ సెంట్రల్ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 7.15 గంటలకు మధురై చేరుకుంటుంది.
అదే విధంగా మధురై-కాన్పూర్ సెంట్రల్ (01926) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు ప్రతీ శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు మధురై నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిరిపూర్‌కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయి. వీటిలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, థర్డ్ ఏసీ ఎకానమి, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ. శ్రీధర్ శనివారం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అడ్రస్‌లో లేరంటూ.. పేర్లు గల్లంతు!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
Read Latest AP News And Telangana News And International News And Telugu News