ఇల్లందులో ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. మతం మారాలంటూ
ABN , Publish Date - Aug 29 , 2026 | 10:39 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 29: ఇల్లందులో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ యువతి ఫిర్యాదులో పేర్కొంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని.. అందుకు అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని యువతి ఆరోపించింది.
అలాగే మతం మారాలని కూడా ఒత్తిడి చేస్తున్నాడని, అందుకు నిరాకరిస్తే తన కుటుంబ సభ్యులను హత్య చేస్తానని బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి చేసిన ఆరోపణలపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
నందమూరి హరికృష్ణ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
ఆస్పత్రిలో వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
Read Latest Telangana News And Telugu News