ఆస్పత్రిలో వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
ABN , Publish Date - Aug 29 , 2026 | 09:32 AM
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పతిలో వ్యక్తి మృతిచెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు.
ఏలూరు, ఆగస్టు 29: జిల్లాలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పతిలో వ్యక్తి మృతిచెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. డ్యాంగే నగర్‌కు చెందిన మంగరాజు నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు లివర్, కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఉన్నాయంటూ తెలిపారు. చికిత్స చేయాల్సి ఉంటుందని కుటుంబసభ్యులకు చెప్పారు. ఇన్ పేషెంట్‌గా చేర్చుకుని మంగరాజుకు సెలైన్ పెట్టారు.
అయితే సెలైన్ ఎక్కిస్తుండగా కొద్దిసేపటికే బాధితుడు స్పృహతప్పి పడిపోయాడు. అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు. అత్యవసర వైద్యం అందించకపోవడం వల్లే మంగరాజు ప్రాణాలు పోయాయని కుటుంబసభ్యులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
నందమూరి హరికృష్ణ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News