తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 29 , 2026 | 07:58 AM
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ తెలుగు రచయిత, భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.
గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా నిర్వహించుకునే తెలుగు భాషా దినోత్సవం తెలుగు భాష ప్రాశస్త్యాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని సీఎం తెలిపారు. తెలుగు భాష పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలు అందరికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలి: పవన్ కల్యాణ్

నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని వ్యాఖ్యానించారు. దేశభాషలందు తెలుగు లెస్స అని విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు, సుందర తెలుగు అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రమణ్య భారతి మన భాషను కొనియాడారని పేర్కొన్నారు. మన మాతృభాష తెలుగులోని తీయదనం, సౌందర్యం అంత గొప్పవని తెలిపారు. తెలుగు భాష పట్ల విద్యార్థి దశ నుంచే ఆసక్తి పెంచాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పుకొచ్చారు.
వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. వాడుక భాష కోసం ఆయన చేసిన కృషి ఎంతో విశిష్ఠమైనదని కొనియాడారు. ఈ సందర్భంగా ఆ మహనీయునికి అంజలి ఘటిస్తున్నానని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి ఇతర రంగాల్లో అభివృద్ధి కోసం ఎన్ని భాషలు నేర్చుకొన్నా మన అమ్మ భాష తెలుగు అనేది ఎప్పుడూ మరచిపోకూడదని తెలిపారు. భావితరాలకు తెలుగు భాషను నేర్పడం, అందరం నిత్య వ్యవహారాల్లో తెలుగులో మాట్లాడటం, రాయడం ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా మన భాష ప్రాశస్త్యాన్ని పెంచగలమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
గిడుగు వెంకట రామమూర్తి సేవలు చిరస్మరణీయం: లోకేశ్

వాడుక భాషోద్యమానికి ఆద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలుగు భాషా వికాసానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి కృషికి గుర్తింపుగా ప్రతి ఏటా జరిపే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు.
ఇవి కూడా చదవండి..
జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదు: సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: రామ్మోహన్
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News