Share News

పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

ABN , Publish Date - Aug 28 , 2026 | 09:08 PM

పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.

పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
AP DGP Harish Kumar Gupta

అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. మంగళగిరి APSP 6వ బెటాలియన్‌లో ఈరోజు (శుక్రవారం) పలు అభివృద్ధి పనులకు డీజీపీ శంకుస్థాపన చేశారు. ‘విహార’, ‘విహారి’ ట్రాన్సిట్ వసతి భవనాలకు, సెంట్రల్ పోలీస్ క్యాంటీన్‌కు మంగళగిరి APSP 6వ బెటాలియన్‌లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు.


పురుష పోలీసు సిబ్బంది కోసం ‘విహార’ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. మహిళా పోలీసు సిబ్బంది కోసం ‘విహారి’ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. ఒక్కో భవనాన్ని 13,603 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారని వివరించారు. బందోబస్తు, అధికారిక పనులపై మంగళగిరికి వచ్చే సిబ్బందికి సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


20 వేల చదరపు అడుగుల్లో ఆధునిక సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ‘విహార’, ‘విహారి’తో పురుష, మహిళా సిబ్బందికి మెరుగైన వసతి కల్పిస్తామని అన్నారు. సెంట్రల్ పోలీస్ క్యాంటీన్‌తో సిబ్బంది, కుటుంబాలకు మరింత మెరుగైన సంక్షేమ సేవలు అందుతాయని వెల్లడించారు. ఆయా నిర్మాణాల్లో, నాణ్యత విషయంలో రాజీపడవద్దని ఆదేశించారు. మూడు ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ

నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 09:19 PM