నందమూరి హరికృష్ణ వర్ధంతి.. నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 29 , 2026 | 08:52 AM
నందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీఎం సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ స్మరించుకున్నారు.
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): నందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీఎం సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ స్మరించుకున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో వారు పోస్టు పెట్టారు.
ప్రజల హృదయాల్లో హరికృష్ణ చిరస్థాయిగా ఉంటారు: సీఎం చంద్రబాబు
‘నాకు అత్యంత ఆత్మీయుడు, మా బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. రాజ్యసభ సభ్యుడుగా, రాష్ట్ర మంత్రిగా ప్రజాసేవలో అశేష సేవలు అందించిన హరికృష్ణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. సినీ నటుడుగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగు ప్రజలకు హరికృష్ణ విశేష సేవలందించారు: లోకేశ్
చైతన్య రథసారథి, తన మామయ్య నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా తెలుగు ప్రజలకు ఆయన విశేష సేవలందించారని కొనియాడారు. నిబద్ధతకు నిలువెత్తు రూపంగా నిలిచారని కీర్తించారు. హరి మామయ్య భౌతికంగా తమ మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు, ప్రేమ తమ హృదయాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని లోకేశ్ పేర్కొన్నారు.
అన్నయ్యా.. నీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు: భువనేశ్వరి

నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి స్మరించుకున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆమె పోస్టు పెట్టారు.
‘నాన్నగారి ఆశయాల కోసం సైనికుడిలా పనిచేసి, ప్రజాసేవలో చెరగని ముద్ర వేసుకుని, ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మా అన్నయ్య, స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. అన్నయ్యా.. నీవు మమ్మల్ని విడిచి దూరమై ఏళ్లు గడిచినా, నీ ఆప్యాయత, నీ ప్రేమ, నీ నిర్మలమైన చిరునవ్వు, నీవు మాతో గడిపిన మధుర క్షణాలు మా గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలుగా నిలిచాయి’ అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదు: సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: రామ్మోహన్
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News