పేదలకు ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ గొప్ప వరం: కొండా సురేఖ
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:05 PM
‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ తెలంగాణ పేద ప్రజలకు ఒక వరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ వ్యాఖ్యానించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబం సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వరంగల్ జిల్లా, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ తెలంగాణ పేద ప్రజలకు ఒక వరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యానించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబం సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈరోజు (గురువారం) వరంగల్ జిల్లా ఉర్సు కరీమాబాద్‌లో కొండా సురేఖ పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
అధికారులు పారదర్శకంగా నమోదు ప్రక్రియను నిర్వహించాలి..
దరఖాస్తుల స్వీకరణ సెంటర్లను సరైన సిబ్బందితో ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ భరోసాను ప్రతి ఒక్క కుటుంబం వినియోగించుకోవాలని సూచించారు. ప్రతీ ఐదు శిబిరాలకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించామని తెలిపారు. వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నమోదు ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కొండా సురేఖ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి
టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ
నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News