సెప్టెంబరు 1 నుంచి.. దానాపూర్ - బెంగళూరు రైలు
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:45 PM
దానాపూర్ (బిహార్), బెంగళూర్(కర్ణాటక) వెళ్లే వరంగల్ వాసులకు శుక్రవారం రైల్వేశాఖ శుభవార్త చెప్పింది.
వరంగల్: దానాపూర్ (బిహార్), బెంగళూర్(కర్ణాటక) వెళ్లే వరంగల్ వాసులకు శుక్రవారం రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. దానాపూర్-బెంగళూర్ మార్గంలో పెరుగుతున్న రద్దీని తగ్గించడంతోపాటుగా ప్రస్తుతం ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న దానాపూర్-బెంగళూర్-దానాపూర్ రైళ్లను రైల్వేశాఖ డెయిలీ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేయడంతో వరంగల్ నుంచి దానాపూర్, బెంగళూర్‌కు ప్రతీ రోజు రైలు సదుపాయం సెప్టెంబరు 1 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది.
దానాపూర్-బెంగళూర్ మధ్య నడిచే దానాపూర్- బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెంబర్ 22365) సెప్టెంబరు 1న మధ్యాహ్నం 2.45 గంటలకు దానాపూర్ నుంచి బయలుదేరి 2వ తేదీ రాత్రి 7గంటలకు వరంగల్ చేరు కుని 7.02 గంటలకు బయలుదేరి విజయవాడ మీదు గా 3న మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూర్ చేరుకుంటుంది. అలాగే సెప్టెంబరు 3న రాత్రి 11.30 గంటలకు బెంగళూర్ నుంచి బయలుదేరే బెంగళూర్-దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (22366) 4న సాయంత్రం 6.18 గంటలకు వరంగల్ చేరుకుని 2 నిమిషాల అనంతరం 6.20 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా 5న అర్ధరాత్రి 12.15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.
దానాపూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్(22365) ప్రతీరోజు విజయవాడ వైపు(బెంగళూర్) రాత్రి 7 గంటలకు ఉంటుంది. అలాగే బెంగళూర్ - దానాపూర్ ఎక్స్‌ప్రెస్(22366) ప్రతీ రోజు బల్లార్ష వైపు(దానాపూర్) సాయంత్రం 6.18 గంటలకు ఉంటుంది. ఈ డెయిలీ రైలు దానాపూర్, ఆరా, బక్సర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ చీయోకి, సాత్నా, జబల్‌పూర్, ఇటార్సీజంక్షన్, నాగపూర్ జంక్షన్, సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్ష, వరంగల్, విజయవాడ,
ఒంగోలు, గూడూరు, పెరంబూరు, కాట్పాడి, జోలార్‌పేట్ జంక్షన్, బంగార్‌పేట్, వైట్‌ఫీల్డ్, బెంగళూర్ రైల్వేస్టేషన్‌లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. దానాపూర్ నుంచి బెంగళూర్ ఈ రైలు ప్రయాణం మూడు రోజులు ఉండనుంది. ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని, ప్రయాణికులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి శ్రీధర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోజుకు 3.70 లక్షల మంది ప్యాసింజర్లు!
అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి
Read Latest AP News And Telangana News And International News And Telugu News