మోడల్ హత్య కేసు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో పట్టుబడ్డ నిందితుడు..
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:43 PM
ఢిల్లీ మోడల్ హత్య కేసులో నిందితుడైన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఎన్‌కౌంటర్ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఢిల్లీ మోడల్ హత్య కేసులో నిందితుడైన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి ఎన్‌కౌంటర్ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని తిలక్‌నగర్‌కు చెందిన 21 ఏళ్ల ముస్కాన్ అనే యువతి మోడలింగ్ చేస్తోంది. ఆమెకు ఇమ్రాన్ అనే జిమ్ ట్రైనర్‌తో ఏడాదిన్నర క్రితం పరిచయం అయింది. ముస్కాన్ వేరే యువకుడితో మాట్లాడుతుండటంతో ఇమ్రాన్ తట్టుకోలేకపోయాడు. ఇమ్రాన్ బుధవారం సాయంత్రం తిలక్‌నగర్‌లోని ముస్కాన్ ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన ఇమ్రాన్.. ముస్కాన్‌పై కత్తితో దాడి చేశాడు. అతి కిరాతకంగా ఆమెను 21 సార్లు పొడిచాడు. దీంతో ముస్కాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇమ్రాన్ అక్కడినుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసు బృందాలు ఇమ్రాన్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. గురువారం రాత్రి రాజౌరీ గార్డెన్ ఏరియాలో ఇమ్రాన్ పోలీసుల కంటబడ్డాడు.
పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ తన దగ్గర ఉన్న తుపాకితో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపటంతో అతడి కాళ్లకు గాయాలు అయ్యాయి. గాయపడ్డ ఇమ్రాన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇవి కూడా చదవండి
మా తండ్రిని చంపేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఇమ్రాన్ కుమారులు