Share News

మా తండ్రిని చంపేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఇమ్రాన్ కుమారులు

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:30 PM

పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్, ఖాసీంలు సంచలన ఆరోపణలు చేశారు. తమ తండ్రిని చంపేందుకు పాక్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మా తండ్రిని చంపేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఇమ్రాన్ కుమారులు
Imran Khan sons

స్పోర్ట్స్ డెస్క్: తమ తండ్రిని చంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం యత్నిస్తోందంటూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొడుకులు సులేమాన్, ఖాసీంలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్, పాకిస్థాన్ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ ఆథర్టన్‌.. ఇమ్రాన్ కుమారులను ఇంటర్వ్యూ చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా ఓ స్పోర్ట్స్ ఛానల్ ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. దీంతో ఇమ్రాన్ కుమారులు చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


ఇంటర్వ్యూలో ఖాసీం మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం, జైలు పరిస్థితుల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ ప్రభుత్వం తన తండ్రిని జైట్లోనే అంతం చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌లో ఇప్పటికే పలువురు రాజకీయ ఖైదీలు జైళ్లలో మరణించారని, తన తండ్రికి కూడా అదే గతి పట్టించాలని చూస్తున్నారని ఆరోపించాడు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తన తండ్రిపై పాక్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఖాసీం మండిపడ్డాడు.


తన తండ్రిని గతంలో కంటే దారుణమైన పరిస్థితుల్లో ఉంచారని, రోజులో 23 గంటలకు పైగా ఒంటరిగా సెల్‌లో నిర్బంధించి మానసికంగా వేధించారని ఖాసీం వెల్లడించాడు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత జైలు పరిస్థితులు మరింత దిగజారినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పారని ఖాసీం గుర్తు చేశాడు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇమ్రాన్ కుమారులు పాక్ ప్రభుత్వ తీరును అంతర్జాతీయ వేదికపై ఎండగట్టారు. దీంతో ఇమ్రాన్ అంశం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం..

ఒంగోలులో లోకేశ్ పర్యటన.. రాడిసన్ 5 స్టార్‌ హోటల్‌కు శంకుస్థాపన

Updated Date - Aug 28 , 2026 | 12:30 PM