చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం..
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:07 PM
చైనాలో భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం దక్షిణ చైనా, సిచువాన్ ప్రావిన్ష్‌లోని లాంగ్‌చాంగ్ సిటీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది.
ఇంటర్‌నెట్ డెస్క్: చైనాలో భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం దక్షిణ చైనా, సిచువాన్ ప్రావిన్ష్‌లోని లాంగ్‌చాంగ్ సిటీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఈ విషయాన్ని చైనా ఎర్త్‌క్వాక్ నెట్‌వర్క్స్ సెంటర్ అధికారికంగా వెల్లడించింది. లాంగ్‌చాంగ్ సిటీలో భూమికి 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
నేపాల్‌లో భూకంపం..
నేపాల్‌లో గురువారం రాత్రి భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. సిక్కింలోని యుక్సామ్‌కు పశ్చిమ-వాయువ్యంగా 24 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రం నేపాల్ సరిహద్దులకు, రాజధాని ఖాట్మండుకు 616 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో.. పర్వత ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.
ఇవి కూడా చదవండి
ఒంగోలులో లోకేశ్ పర్యటన.. రాడిసన్ 5 స్టార్ హోటల్‌కు శంకుస్థాపన
రాజీనా.. రాజీనామానా?.. రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ