Share News

రాజీనా.. రాజీనామానా?.. రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:39 AM

రాఖీ పండగ వేళ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనకు రాఖీ కట్టిన అనంతరం సుస్మిత వ్యాఖ్యలపై సంభాషించినట్టు తెలుస్తోంది.

రాజీనా.. రాజీనామానా?.. రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి కొండా సురేఖ
Konda Surekha meets CM Revanth Reddy

ఇంటర్నెట్ డెస్క్: సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆమె రాఖీ కట్టారు. ఆ తర్వాత ఆమె తన కూతురు సుస్మిత వ్యాఖ్యలపై ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది.

పరకాల ఎపిసోడ్ తరువాత మొదటిసారి సీఎం నివాసానికి వెళ్లారు సురేఖ. దీంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల చర్చలు జోరందుకున్నాయి. కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న సురేఖ.. ఇవాళ ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి నెలకొంది. రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చాక ఆయనతో చర్చిస్తానని ఆమె గతంలో చెప్పారు. అయితే.. ఈ చర్చ వివాదం సద్దుమణిగేలా చేస్తుందా లేదా సురేఖ రాజీనామాకు దారి తీస్తుందా.? అని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. కుమార్తె మాటలను ఖండించనందుకు సురేఖపై వేటు వేయాలని క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అప్పుడే సురేఖ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ భేటీ తరువాత ఈ వివాదంపై ఓ క్లారిటీ రానుంది.


ఇవీ చదవండి:

అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి.. సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న సీఎం విజయ్..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే!

Updated Date - Aug 28 , 2026 | 12:10 PM