Share News

అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి.. సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న సీఎం విజయ్..

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:19 AM

తమిళనాడు అసెంబ్లీలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వీడ్కోలు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం సీటును వదిలి మంత్రులో కలిసి కూర్చున్నారు.

అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి.. సీఎం సీటు వదిలి మంత్రుల మధ్య కూర్చున్న సీఎం విజయ్..
Vijay Tamil Nadu Chief Minister

ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో కాలంగా వస్తున్న సంప్రదాయానికి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వీడ్కోలు పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం సీటును వదిలి మంత్రులో కలిసి కూర్చున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కోసం ఓ విశాలమైన, ప్రత్యేక సీటు కేటాయించారు. ఆ సీటు స్పీకర్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. సీఎం సీటు పక్కన.. ముందు వరుసలో మంత్రుల కోసం విశాలమైన సీట్లు కేటాయించారు. సీనియారిటీ ఉన్న మంత్రులు మొదటి వరుసలోని సీట్లలో కూర్చుంటారు.

tamil-nadu.jpg


బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ తన సీటును వదిలి పక్కకు వచ్చేశారు. మంత్రులు కేఏ సెంగోట్టియాన్, అధవ్ అర్జున మధ్యలోకి వెళ్లి కూర్చున్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మంత్రులకు కేటాయించిన సీట్లలో కూర్చోలేదని తెలుస్తోంది. సాధారణంగా తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు తోటి మంత్రులతో మాట్లాడటానికి తమ సీట్లు మారుతుంటారు. సంభాషణ పూర్తయిన తర్వాత తమ స్థానంలోకి వచ్చి కూర్చుంటారు. కానీ, ఓ ముఖ్యమంత్రి తన అధికారిక సీటును వదిలి మంత్రులతో కూర్చోవటం ఇదే మొదటిసారి.


ఇవి కూడా చదవండి

సరస్సు పేరు మార్చిన ట్రంప్.. వ్యతిరేకించిన కెనడా

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్.

Updated Date - Aug 28 , 2026 | 11:49 AM