Share News

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ‘పోరుబాట’

ABN , Publish Date - Aug 28 , 2026 | 11:15 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై పోరుబాటకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మాజీ మంత్రి.. నేతలకు దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ‘పోరుబాట’
BRS Porubata

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై పోరుబాటకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు(శుక్రవారం) పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మాజీ మంత్రి.. నేతలకు దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసాలపై బీఆర్‌ఎస్ పోరుబాట‌కు సిద్ధమైంది. వారం రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలను చేపట్టాలని, 420 హామీల అమలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వెయ్యి రోజులైనా నెరవేరని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని, కాంగ్రెస్ హామీల వైఫల్యం, అవినీతిపై పోరాడాలని టెలికాన్ఫరెన్స్‌లో నేతలకు కేటీఆర్ నిర్దేశం చేశారు. సెప్టెంబర్1న తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌తో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లనుంది.


రెండో తేదీ నుంచి వరుసగా కార్యక్రమాలు

సెప్టెంబర్ 2

  • ఆరు గ్యారెంటీల వైఫల్యంపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు

  • 420 హామీల మోసాన్ని గుర్తుచేస్తూ భారీ ఫ్లెక్సీల ప్రదర్శన

  • ప్రజలకు బాకీ ఉన్న హామీలతో ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ

సెప్టెంబర్ 3

  • వ్యవసాయ విధ్వంసంపై అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు

  • సాగునీరు, విద్యుత్, యూరియా, బీమా సమస్యలపై రైతులతో సమావేశాలు

  • హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై నిరసనలు

సెప్టెంబర్ 4

  • మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు

  • మహిళలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యంపై నిరసన కార్యక్రమాలు

  • రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అంశాలపై నిలదీత

  • హామీలు అమలు చేయని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు

సెప్టెంబర్ 5

  • విద్యార్థులు, యువతతో నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు

  • ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌పై పోరాటం

  • అదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు


సెప్టెంబర్ 6

  • హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ

  • తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీత

  • గ్రామాల్లో పారిశుద్ధ్యం, పల్లెల సమస్యలపై నిరసన కార్యక్రమాలు

సెప్టెంబర్ 7

  • ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతిపత్రాలు

  • 420 హామీల మోసంపై జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు

సెప్టెంబర్ 8

  • వారం రోజుల పోరాట కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్‌మీట్లు

  • అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు

సెప్టెంబర్ 10

  • ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్‌ఎస్ సంఘీభావం


ఇవి కూడా చదవండి..

జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్పు

రాఖీ పండుగతో పాటు వీకెండ్.. సొంతూర్లకు హైదరాబాదీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 11:43 AM