జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్పు
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:33 AM
జర్నలిస్టులకు ఇచ్చే అవార్డుల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది
అమరావతి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టులకు ఇచ్చే అవార్డుల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ‘బి.నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డు’ను ‘కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డు’గా మార్చింది. ‘ఎం.ఎ.రహీం ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు’ను ‘కొక్కు అహోబలరావు ఉత్తమ ఫొటో జర్నలిస్టు అవార్డు’గా సవరిచింది. ‘ఖాసా సుబ్బారావు, ఎం.నర్సింగరావు, షోయబుల్లా ఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు’లను ‘ఖాసా సుబ్బారావు, ముట్నూరి కృష్ణారావు, మద్దుకూరి చంద్రశేఖరరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డు’లుగా మార్చింది. ‘ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డు’ను ‘సావిత్రిబాయి ఫూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డు’గా మార్చింది. ‘ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు’ను ‘అబ్దుల్ కలాం ఆజాద్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు’గా సవరించింది.