జాబ్ సెర్చింగ్‌కు ఒక యాప్
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:07 PM
డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ యువతకు సాంకే తికత అండగా నిలుస్తోంది.
నిరుద్యోగులకు వరం ’డీఈఈటీ‘ యాప్
ఏఐ టెక్నాలజీతో కొలువుల సమాచారం
నకిలీ ప్రకటనలు, మధ్యవర్తుల దోపిడీకి చెక్
ముత్తారం(కరీంనగర్): డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ యువతకు సాంకే తికత అండగా నిలుస్తోంది. నోటిఫికేషన్ రాగానే ఇంటర్నెట్ సెం టర్లకు పరుగులు తీయడం, దరఖాస్తుల పేరిట ఫీజులు చెల్లించి జేబులు గుల్ల చేసుకోవడం ఇకపై తప్పనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ’డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ‘ (డీఈఈటీ) యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఒకే వేదికపై కొలువుల సమాచారం
ఈ యాప్ ద్వారా అభ్యర్థులు ఒకే ప్లాట్‌ఫామ్‌పై వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు, ఖాళీల వివరాలను సమగ్రంగా తెలుసుకోవచ్చు. మధ్యవర్తులు, నకిలీ ఉద్యోగ ప్రకటనల బారిన పడకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. అభ్యర్థుల ప్రతిభ, విద్యార్హతలకు సరిపడే అవకాశాలను గుర్తించడంలో ఏఐ సాంకేతికత తోడ్పడుతుంది.
నమోదు ఎలా చేసుకోవాలంటే..
స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘డీఈఈటీ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
యాప్‌లో వ్యక్తిగత సమాచారంతో పాటు విద్యార్హతలు, నైపుణ్యాల వివరాలను నమోదు చేయాలి.
సంబంధిత ధ్రువపత్రాలను (సర్టిఫి కెట్లను) అప్‌లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్త వుతుంది.
అనంతరం అర్హతలకు తగిన ఉద్యోగాలను పరిశీలించి, నేరుగా యాప్ ద్వారానే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
రోజుకు 3.70 లక్షల మంది ప్యాసింజర్లు!
అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి
Read Latest AP News And Telangana News And International News And Telugu News