Share News

ఔషధాల గని.. బోడ కాకరకాయ

ABN , Publish Date - Jul 30 , 2026 | 10:33 AM

మానవుడికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒక్కటి. వీటిని అకాకరకాయ, అడవి కాకరకాయ అని పిలుస్తారు.

ఔషధాల గని.. బోడ కాకరకాయ
Vantalu, Health

  • తొలకరి జల్లులకు కాత

  • మార్కెట్‌లో కిలో రూ.300 నుంచి రూ.400 చొప్పున విక్రయం

  • అయినా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు

కోహెడ(సంగారెడ్డి): మానవుడికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒక్కటి. వీటిని అకాకరకాయ, అడవి కాకరకాయ అని పిలుస్తారు. చూడడానికి మామూలు కాకరకాయల్లాగానే ఉన్నా.. వీటి రుచిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. బోడ కాకరకాయ అటవీ ప్రాంతంలో సహజంగా దొరికేవి. బీడు భూముల్లో, పర్వత ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురిసినప్పుడు జూన్‌ నుంచి జూలై మాసంలో మొలకెత్తి, ఆగస్టు నుంచి అక్టోబరు వరకు మనకు లభిస్తాయి. మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉన్నా.. ఔషధాల గని కావడంతో ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వానాకాలంలో విరివిగా దొరికే బోడ కాకర కాయలను తినడం వల్ల భయంకరమైన వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని చెబుతున్నారు.


mdk1.2.jpgమార్కెట్లో భలే గిరాకీ

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బోడ కాకరకాయ ధర కొండెక్కింది. చికెన్‌ ధర కన్నా ఎక్కువే. ప్రస్తుతం కిలో రూ.300 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. ఇది అటవీజాతి పంట కావడంతో కూలీలకు, రైతులకు భలే గిరాకీ లభిస్తుంది. ఎంత ధర ఉన్నా ఆరోగ్యానికి, రుచికి ఎక్కువ మేలు చేస్తుందని ప్రజలు కొనుక్కుని పోతున్నారు.


mdk1.3.jpgఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో...

బోడ కాకరకాయలు తినడం వల్ల సీజనల్‌ వ్యాధులతో పాటు బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘మటన్‌, చికెన్‌ దండగా బోడ కాకరకాయ ఉండగా’ అన్న సామెత ఈ ప్రాంతంలో నానుడిలో ఉంది. వీటిలో బీ1, బీ2, బీ3 విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం వంటి మూలకాలు ఉంటాయని డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనిషి శరీరంలోని 15 రోగాలను నయం చేసే ఔషధ గుణాలు బోడ కాకరకాయలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అక్రమార్కులపై చర్యలేవీ!

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 10:33 AM