రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు
ABN , Publish Date - May 02 , 2026 | 01:29 PM
రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేటఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చారణా చేసి.. బారనా ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు.
సిద్దిపేట, మే2 (ఆంధ్రజ్యోతి): రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు. ఈరోజు (శనివారం) కుకునూర్‌పల్లి మండల కేంద్రంలోని బీరప్ప ఆలయ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో పలువురు చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట జిల్లాలో ఎక్కడలేని విధంగా బీరప్ప దేవాలయాన్ని అనాడు కేసీఆర్ చాలా చక్కగా నిర్మించారని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్‌లో మూగజీవాలకు నీరు, గ్రాసం దొరక్క జీవాలను మేపడానికి ఎక్కడికో వెళ్తుండేవారని.. కానీ కొండపోచమ్మ , మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో నీరు, గ్రాసం కోసం వేరేవాళ్లు ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. జీవాలకు నట్టల మందు కూడా ఇవ్వడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చేతకావట్లేదని సెటైర్లు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలకు రెక్కలు రాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములను కోనేవారు, చూసేవారు లేరని హరీశ్‌రావు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కార్మికుల కన్నీటి చుక్కలే నాగరికత చరిత్రకు సిరా: సీఎం రేవంత్‌రెడ్డి
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి పొన్నం
Read Latest Telangana News And AP News And International News And Telugu News