Share News

తెలంగాణవ్యాప్తంగా ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్ర చేపడతాం: రఘునందన్ రావు

ABN , Publish Date - May 24 , 2026 | 01:51 PM

రేపటి నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ పేరిట యాత్ర చేపట్టబోతున్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు.

తెలంగాణవ్యాప్తంగా ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్ర చేపడతాం: రఘునందన్ రావు
BJP Medak MP Raghunandan Rao

మెదక్, మే 24 (ఆంధ్రజ్యోతి): రేపటి నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ పేరిట యాత్ర చేపట్టబోతున్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP Medak MP Raghunandan Rao) వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. రైతులతో రాజకీయాలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. ఈరోజు (ఆదివారం) ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో రఘునందన్ రావు మాట్లాడారు.


ధాన్యం కొనుగోలుపై సీఎం సమాధానం చెప్పాలి..

ఎనభై శాతం ధాన్యం కొనుగోలు ఎక్కడ జరిగిందో సీఎం సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అధికారులు ఇచ్చిన లెక్కలను చూసి తప్పుడు సమాచారం చెప్పడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు నచ్చిన జిల్లాకు వెళ్లి నేరుగా రైతులతో మాట్లాడితే ధాన్యం ఎంత కొనుగోలు చేస్తారో తెలుస్తోందని చెప్పారు. రెండు రోజుల పాటు రైతులతోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద తాము మాట్లాడిస్తామని చెప్పుకొచ్చారు. తాము రాజకీయాలే చేయాలనుకుంటే వేరేలాగా చేస్తామని అన్నారు. తమకు కావాల్సింది రైతుల సంక్షేమమని తెలిపారు. అన్నదాతలకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హైదరాబాద్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా ఎదగాలి: కిషన్‌రెడ్డి

బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 01:55 PM