Share News

నా గురించి అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడుతా.. మంత్రి జూపల్లి వార్నింగ్

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:36 PM

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే పరువునష్టం వేశానని, క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు.

నా గురించి అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడుతా.. మంత్రి జూపల్లి వార్నింగ్
Telangana Minister Jupally Krishna Rao

నాగర్ కర్నూల్ జిల్లా, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు (Telangana Minister Jupally Krishna Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే పరువునష్టం వేశానని, క్రిమినల్ కేసులు పెడతానని హెచ్చరించారు. ఈరోజు (బుధవారం) నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను నిజాయితీగా బతికానని.. ఎవర్నీ మోసం చేయలేదని స్పష్టం చేశారు. తాను వ్యాపారం చేసి.. ఎల్ఐసీ లోన్ తీసుకున్నానని తెలిపారు. వ్యాపారం చేసి రాజకీయాల్లోకి తాను వచ్చానని తేల్చిచెప్పారు. కబ్జాలు, మోసాలు చేసి రాజకీయాలకు రాలేదని స్పష్టం చేశారు. నిరంజన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.


నీకు డిపాజిట్ రాలేదు..

‘నువ్వు నాకు రాజకీయ భిక్షపెట్టావా.. తెలివి ఉందా, నీలో అసలు నిజాయితీ ఉందా. 2004లో అప్పటి టీఆర్ఎస్, కాంగ్రెస్ టికెట్ ఇస్తే నీకు డిపాజిట్ రాలేదు. ఒక్కసారికే నిన్ను వనపర్తి ప్రజలు ఓడించారు. కబ్జాలను విడిపించి, సామాన్య ప్రజలకు నేను న్యాయం చేశాను. నీ మాదిరిగా రాజకీయాలు చేయలేదు, వ్యాపారం చేసి రాజకీయాలు చేశాను. రేపు ఎన్నికలు వస్తే వనపర్తి ప్రజలు చెబుతారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నా. గట్టు ప్రాంతంలో హెలికాఫ్టర్‌లో దిగాను. కేసీఆర్ కూర్చివేసుకొని ప్రాజెక్టులు పూర్తి చేశానని చెప్పారు. ఆరోజు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే.. ఈ రోజు రైతులకు నీటి సమస్య రాదు కదా. నిరంజన్ రెడ్డి నీవు న్యాయవాదివి.. నువ్వు న్యాయంగా ఉన్నావా. జ్ఞానంతో, ఆలోచన, సంస్కారంతో మాట్లాడు. రైతుల పంటలను కాపాడే ప్రయత్నం మేము చేస్తున్నాం. మిషన్ భగీరథకు నీటిని నింపి, ఎంజీకేఎల్ఐ ఐదు పంపులు నడుపుతాం. ప్రజలకు వాస్తవాలు తెలుసు’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 10:05 PM