Share News

కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:18 PM

కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఇరిగేషన్‌పై లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Minister Uttam Kumar Reddy

భద్రాద్రి కొత్తగూడెం, జులై 16 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఇరిగేషన్‌పై లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిర్మాణం చేసిన కాళేశ్వరం కూలిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఈరోజు (గురువారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వం తెలంగాణకు ఎంత నష్టం చేసిందో స్పష్టంగా కనపడుతోందని అన్నారు.


సీతారామసాగర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం..

సీతారామసాగర్ ప్రాజెక్ట్‌ను తప్పకుండా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలను పారిస్తామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో సీతారామసాగర్‌కు కనీసం ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీతారామసాగర్ బీఆర్‌ఎస్ పాలనకు నిదర్శనమని అన్నారు. కాళేశ్వరానికి మూడేళ్లలో ఎలా బీటలు వచ్చాయో చూశామని చెప్పారు. మేడిగడ్డ కూడా బీఆర్ఎస్ హయాంలోనే కూలిందని విమర్శించారు. డీపీఆర్‌లో ఉన్న ఫౌండేషన్‌ను మార్చి మరో పద్ధతిలో నిర్మించారని తెలిపారు.


నాణ్యత లోపంతో బ్యారేజీలు నిర్మించారు..

సుందిళ్ల ప్రతిపాదిత స్థలంలో కాకుండా మరో చోట నిర్మించారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. రైతుల నుంచి తాము వరి కోనుగోళ్లు చేసి నేరుగా అకౌంట్‌లో డబ్బులు వేశామని వెల్లడించారు. మూడు బ్యారేజీలు టెస్ట్ నడుస్తోందని.. లాజికల్‌గా తమ ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాణ్యత లోపంతో బ్యారేజీలు నిర్మించారని అన్నారు. కేసీఆర్ హయాంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా సరిగా ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే అని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఉద్ఘాటించారు. రాష్ట్రపాలన మొత్తం ఈ జిల్లా నుంచే కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

ఆస్తి వేలం వివాదం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 04:24 PM