Share News

మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:35 PM

పేదవారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా తమ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. రూ.40 వేల కోట్లతో తాము ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామని పేర్కొన్నారు.

మా హయాంలో పేదవారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
Telangana Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం జిల్లా, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పేదవారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా తమ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Telangana Minister Ponguleti Srinivas Reddy) వ్యాఖ్యానించారు. రూ.40 వేల కోట్లతో తాము ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొరట్లగూడెంలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు.


2.21 లక్షల ఇళ్లను తాము పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ హయాంలో మాదిరిగా మాటలు చెప్పకుండా ఇళ్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరు గగ్గోలు పెట్టిన పేదవారికి సాయం చేసే విషయంలో తాము వెనక్కు తగ్గమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

దీపావళి కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 12:56 PM