Share News

దీపావళి కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు: మంత్రి సీతక్క

ABN , Publish Date - Nov 07 , 2026 | 07:49 PM

దీపావళి పండుగ కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లను ఇవ్వనున్నట్లు తెలంగాణ మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లను తమ ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు.

దీపావళి కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు: మంత్రి సీతక్క
Telangana Minister Seethakka

హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగ కానుకగా మరో 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లను ఇవ్వనున్నట్లు తెలంగాణ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) ప్రకటించారు. అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లను తమ ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. ఈరోజు (శనివారం) మంత్రి సీతక్క ఓ ప్రకటన విడుదల చేశారు. కొడంగల్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రేపు (ఆదివారం) ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి సీతక్క కూడా పాల్గొననున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్తగా పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులకు చేయూత ఇవ్వనుందని వెల్లడించారు.


కొడంగల్‌లో పలువురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తామని మంత్రి సీతక్క అన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా ఈ పత్రాలను పంపిణీ చేస్తారని చెప్పారు. కొత్తగా పింఛన్లకు మంజూరైన వారందరికీ ఈ నెల నుంచే చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. పండుగ వేళ లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను తమ ప్రభుత్వం కల్పించనుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మరో ఐదు పట్టణాలకు ఇందిరమ్మ ఇళ్లు

రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు: సీఎం డీకే శివకుమార్

మైనార్టీల విద్య, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 08:00 PM