మైనార్టీల విద్య, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:11 PM
మైనార్టీల విద్య, సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించామని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మైనార్టీల విద్య, సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Telangana Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ఓల్డ్ సిటీ అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించామని పేర్కొన్నారు. షాదీ ముబారక్, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు (శుక్రవారం) ప్రజాభవన్‌లో మంత్రి అజారుద్దీన్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.
స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు చర్యలు..
నాంపల్లి హజ్‌హౌస్ పక్కన అసంపూర్తి భవన నిర్మాణానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. త్వరితగతిన భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. భవనంలో మైనార్టీ స్టడీ సర్కిల్, సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొఘల్‌పురా, బండ్లగూడలో రెండు స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. మైనార్టీ విద్యాసంస్థల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఉండవద్దని ఆజ్ఞాపించారు.
ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకంలోకి ఈజిప్ట్, సౌదీ అరేబియా..
ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకంలోకి ఈజిప్ట్, సౌదీ అరేబియాలను చేర్చినట్లు మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిష్కరించాలని ఆజ్ఞాపించారు. క్రైస్తవ మైనార్టీల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు మల్లు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News