తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మరో ఐదు పట్టణాలకు ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:38 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఐదు ప్రధాన పట్టణాలకు ఇందిరమ్మ ఇళ్లు - టవర్స్ పథకాన్ని విస్తరించింది. నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఐదు ప్రధాన పట్టణాలకు ఇందిరమ్మ ఇళ్లు - టవర్స్ పథకాన్ని విస్తరించింది. నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ - 579ను ప్రభుత్వం జారీ చేసింది. ఐదు పట్టణాల్లో మొత్తం 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ అనుమతి ఇచ్చింది.
ఒక్కో ప్రాంతంలో 480 ఫ్లాట్ల చొప్పున ఇళ్లను రాష్ట్ర సర్కార్ నిర్మించనుంది. G+5 విధానంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం చేపట్టనుంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయానికి రూ.8.50 లక్షలు కేటాయించనుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.204 కోట్లుగా అంచనా వేసింది. అర్హులైన EWS, LIG కుటుంబాలకు ఒక్కో యూనిట్‌పై రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనుంది. లబ్ధిదారుల వాటాగా గరిష్ఠంగా రూ.3.50 లక్షలను చెల్లించనుంది. దరఖాస్తుల అర్హత, పరిశీలన, లాటరీ విధానంపై హౌసింగ్ బోర్డుకు బాధ్యతలు అప్పగించింది. ఆయా స్థలాల గుర్తింపు, కేటాయింపులో జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులకు తెలంగాణ సర్కార్ బాధ్యతలు అప్పగించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News