రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు: సీఎం డీకే శివకుమార్
ABN , Publish Date - Nov 06 , 2026 | 08:35 PM
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అందించిందని పేర్కొన్నారు.
ఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (CM DK Shivakumar) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అందించిందని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో దీపావళి మిలన్ వేడుకలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యులు, డీకే శివకుమార్, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు ఎంపీలతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడారు.
కాంగ్రెస్ బలం అంటే దేశ బలం..
కాంగ్రెస్ చరిత్ర అంటే దేశ చరిత్ర, కాంగ్రెస్ బలం అంటే దేశ బలమని డీకే శివకుమార్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా, సమాజంలోని ప్రతివర్గానికి సమాన అవకాశాలను, ఫలాలను అందించిందని ప్రస్తావించారు. పార్టీపై విశ్వాసంతో నిరంతరం పనిచేసిన కార్యకర్తలు, శ్రేణులు మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ఇది ఒక దీపావళి వేడుక అని.. చాలా చక్కని ఏర్పాట్లు చేశారని, తామంతా ఎంతో ఆనందించామని సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News