ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్ రంగాల్లో గ్లోబల్ పెట్టుబడులకు ప్రోత్సాహం: మంత్రి శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Nov 07 , 2026 | 02:48 PM
హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఫిన్‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీయల్ అండ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను అంతర్జాతీయ ఫిన్‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Telangana Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీయల్ అండ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. హైటెక్ సిటీలో ఆర్థాఫిన్‌టెక్ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం..
ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్ రంగాల్లో గ్లోబల్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌లో పరిశోధన, అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పుకొచ్చారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతమైన మానవ వనరుల తయారీకి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మారుస్తామని ఉద్ఘాటించారు. బ్యాంకింగ్, అంతర్జాతీయ చెల్లింపులు, డిజిటల్ వాలెట్లలో ఆర్థాఫిన్‌టెక్ సేవలు అందిస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మరో ఐదు పట్టణాలకు ఇందిరమ్మ ఇళ్లు
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారు: సీఎం డీకే శివకుమార్
మైనార్టీల విద్య, సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News