సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ఉద్యోగులు పనిచేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:38 PM
పేదలకు సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి.. కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు.
కరీంనగర్, సెప్టెంబర్ 30: పేదలకు సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(బుధవారం) జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి.. కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఆపై కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతినిధులని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేది అధికారులే అని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వానికి మంచిపేరు వచ్చినా.. చెడ్డపేరు వచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగుల వల్లే అని సీఎం అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రూ.944 కోట్లతో పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. అందరి సహకారంతోనే ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సహాయం కోసం వచ్చినవారిలో కుటుంబసభ్యులను చూడాలన్నారు. సమస్యలతో వచ్చిన పేదలకు వెంటనే పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందు కార్యక్రమాలను ఎన్నికల సమయంలోనే రాజకీయం చేయాలన్నారు. ఎన్నికలు లేని సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యం’.. వీబీ జీ రామ్ జీ అమలుపై మంత్రి సీతక్క సమీక్ష
ఆసియా క్రీడల్లో స్వర్ణం.. చికిత, సాహిల్‌కు సీఎం రేవంత్ అభినందనలు
Read Latest Telangana News And Telugu News