Share News

‘గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యం’.. వీబీ జీ రామ్ జీ అమలుపై మంత్రి సీతక్క సమీక్ష

ABN , Publish Date - Sep 30 , 2026 | 01:48 PM

వీబీ జీ రామ్ జీపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష చేపట్టారు.

‘గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యం’.. వీబీ జీ రామ్ జీ అమలుపై మంత్రి సీతక్క సమీక్ష
Minister Seethakka

హైదరాబాద్, సెప్టెంబర్ 30: వీబీ జీ రామ్ జీపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష చేపట్టారు. గ్రామాల్లో పనుల గుర్తింపు, ఉపాధి కల్పన, పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి క్షేత్రస్థాయి సమస్యలపై మంత్రి ఆరా తీశారు. VB–G RAM G అమలులో గ్రామ పంచాయతీల పాత్ర, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పనుల ఎంపికలో గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.


ఉపాధి పనుల్లో పారదర్శకత, నాణ్యత, జవాబుదారీతనానికి పెద్దపీట అని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా మండల, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి, గ్రామాలకు అభివృద్ధి, VB–G RAM G అమలును మరింత పటిష్ఠం చేయాలని మంత్రి సీతక్క దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో 12 వేల మందికిపైగా సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

‘సిరిసిల్లలో చేసిన అభివృద్ధిలో పదిశాతం చేయగలరా’.. సీఎం రేవంత్‌కు పాడి కౌశిక్ సవాల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 02:00 PM