Share News

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:05 AM

డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువతి తనను పబ్‌కు తీసుకెళ్లి భారీగా బిల్లు వసూలు చేసేందుకు ప్రయత్నించిందంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!
Dating App

  • యువతిపై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫిర్యాదు

హైదరాబాద్: డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువతి తనను పబ్‌కు తీసుకెళ్లి భారీగా బిల్లు వసూలు చేసేందుకు ప్రయత్నించిందంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. క్వాక్‌క్వాక్‌ డేటింగ్‌ యాప్‌లో దివ్య పేరుతో పరిచయమైన యువతి.. చెరుకు హేమంత్‌ని ఈ నెల 28న నీరూస్‌ జంక్షన్‌ వద్ద కలుసుకుని పబ్‌కు తీసుకెళ్లింది. అక్కడ పలు ఆర్డర్లు ఇవ్వడంతో రూ.29,884 బిల్లు చేసింది.


city2.2.jpgతాను తీసుకున్న కొన్ని పానీయాలు మద్యం కానప్పటికీ ఖరీదైన మద్యం పేరుతో బిల్లు వేసినట్లు గుర్తించాడు. సిబ్బంది, బౌన్సర్లు తన చుట్టూ చేరిన సమయంలో యువతి రూ.10 వేల చెల్లించినట్లు నకిలీ లావాదేవీ చూపించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనిపై అనుమానాలు ఉన్నాయని, యువతి, పబ్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని హేమంత్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధరలు

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 08:05 AM