శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:42 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. క్యూలైన్‌లో భక్తులు అధికంగా ఉన్న క్రమంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్ మూసివేశారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.26 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 54,171
తలనీలాలు సమర్పించినవారు: 36,671
ఈ వార్తలు కూడా చదవండి:
భానుడి భగభగ.. చెదురుమదురు వర్షాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News