గోదావరిలో తగ్గిన నీటిమట్టం
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:22 AM
గోదావరి ఉపనదుల నుంచి వస్తున్న వరద జలాలతో ఐదు రోజులుగా పెరిగిన గోదావరి నీటిమట్టం మంగళవారం తగ్గుముఖం పట్టింది.
పోలవరం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గోదావరి ఉపనదుల నుంచి వస్తున్న వరద జలాలతో ఐదు రోజులుగా పెరిగిన గోదావరి నీటిమట్టం మంగళవారం తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 6,79,930 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్టు డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. కాఫర్ డ్యామ్‌కు ఎగువన 31.650 మీటర్లు, స్పిల్‌వే ఎగువన 31.550 మీటర్లు నీటిమట్టం నమోదైంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 32.60 అడుగులకు చేరుకుంది.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం