Share News

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:22 AM

నంద్యాల జిల్లాలో వరుస ఆత్మహత్యలతో విషాదం నెలకొంది. వేర్వేరు ఘటనలో నలుగురు మృతిచెందారు. క్షణికావేశంలో ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. తనువు చాలించి మృత్యుదరి చేరి అయిన వారికి కష్టాలు మిగిల్చారు. ఎంతో భవిష్యత్తును ఉన్న ఓ కుటుంబం అతాశ్యకు పోయి ప్రాణాలు కోల్పోయింది. సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో స్టాక్‌ మార్కెట్‌ కలకలం సృష్టించింది. నష్టాలతో భార్య బలవనర్మణానికి పాల్పడ్డగా ఆమె మృతిని జీర్ణించుకోలేక భర్త సైతం ప్రాణాలు వదిలేశాడు. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. జీవితంపై విరక్తి చెంది వృద్ధ దంపతులు సైతం ఆత్మహత్య చేసుకున్నారు.

వేర్వేరు ఘటనల్లో  ఐదుగురి బలవన్మరణం
మౌనిక, కిరణ్‌ దంపతులు(ఫైల్‌)

దంపతులను మింగేసిన స్టాక్‌ మార్కెట్‌

భార్య మృతిని జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య

అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు

జీవితంపై విరక్తి చెంది వృద్ధ దంపతులు..

ఫ నంద్యాల జిల్లాలో వరుస ఘటనలు

ఫ్యాన్‌కు ఉరేసుకొని భార్య.. తట్టుకోలేక భర్త..

నంద్యాల/ నూనెపల్లి/ బండిఆత్మకూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొన్ని నెలల క్రితం వరకు ఆ కుటుంబం ఆడుతూ పాడుతూ ఉండేది. ఆ కుటుంబంలో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ పెను మార్పులకు దారితీసింది. భార్య ట్రేడింగ్‌ చేసి నష్టాలను చవిచూసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. భార్య మరణానికి జీర్ణించుకోలేక భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని అనంత లోకాలకు చేరాడు. ఈహృదయ విదారక ఘటన నం ద్యాల పట్టణంలోని మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రోజాకుంటకు చెందిన కిరణ్‌(40), మౌనిక (36) దంపతులు. అతడు సంజీవనగర్‌ రామాలయం కాంప్లెక్స్‌లో బుక్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. భార్య మౌనిక భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. వీరికి ఇద్దరు కుమార్తెలు సుష్మిత. సురక్ష ఉన్నారు. ఆమె కొద్దికాలం నుంచి ఆన్‌లైన్‌ స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేయడం ప్రారంభించింది. భారీగా నష్టపోయింది. చివరికి తన బంగారు నగలను సైతం తాకట్టు పెట్టి మరీ డబ్బును పోగొట్టుకుంది. అప్పులు ఏలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపం చెంది మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొంది. సాయంత్రం కిరణ్‌ దుకాణం నుంచి ఇంటికి వచ్చాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్యను చూసి బోరున విలపించాడు. ఆ తర్వాత విషయాన్ని మార్కాపురంలో ఉన్న తన సోదరుడైన సురే్‌షకు ఫోన్‌ చేసి తెలియజేశాడు. భార్య మృతిని జీర్ణించుకోలేక ఉరేసుకొని తనువు చాలించాడు. అక్కడి నుంచి కుటుంబీకులు వచ్చే సమయానికి దంపతులు విగతజీవులుగా మారారు. పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారా రు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అనారోగ్య సమస్యలు ఉండగా..

అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని ఈర్నపాడులో చోటుచేసుకుంది. గ్రామంలో ఉప్పరి గోపాల్‌(58) రమణమ్మ (53) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి శివప్రసాద్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఆర్మీలో పనిచేస్తున్నారు. కుమారుడు ప్రతి నెల రూ.5వేలు జీవనం కోసం పంపుతున్నారు. కొంతకాలంగా రమణమ్మకు అనారోగ్య సమస్యలు ఉండగా.. గోపాల్‌ తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో తమ కుమారుడు పంపించే డబ్బులు ఏమాత్రం సరిపోక పోవడంతో ఆవేదనకు గురైనట్లు సమాచారం. ఇంతలోనే ఏం జరిగిందో.. ఏమో కానీ.. ఆత్మహత్యే శరణ్యమని భావించి దంపతులు ఇద్దరు వేర్వేరుగా ఇంటి పైకప్పుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం ఉదయం నుంచి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పక్కింటి వారు సాయంత్రం తలుపు తట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

చీరతో ఉరేసుకొని మహిళ..

వెలుగోడు: మండలంలోని వేల్పనూరు గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన కళ్యాణి (24) ఇంట్లో సోమవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుంది. మృతురాలి తల్లి రోజామణి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు, మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:25 AM