Share News

ఆసియా క్రీడలు: వర్షంతో టోర్నీ నుంచి ఔట్.. మలేసియా క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:52 AM

ఆసియా క్రీడలు 2026లో పురుషుల క్రికెట్‌ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒక్క క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరగకుండానే సెమీఫైనల్‌ చేరిన జట్లేవో తేలిపోయాయి. ఈ క్రమంలో మలేసియా క్రికెటర్‌ విరాన్‌దీప్‌ సింగ్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది.

ఆసియా క్రీడలు: వర్షంతో టోర్నీ నుంచి ఔట్.. మలేసియా క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్
Virandeep Singh

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో పురుషుల క్రికెట్‌ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒక్క క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ కూడా జరగకుండానే సెమీఫైనల్‌ చేరిన జట్లేవో తేలిపోయాయి. మెరుగైన ర్యాంకింగ్స్ కారణంగా భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు వర్షం కారణంగా మ్యాచ్‌లు ఆడకుండానే సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో మలేసియా క్రికెటర్‌ విరాన్‌దీప్‌ సింగ్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌తో క్వార్టర్‌ఫైనల్‌ ఆడేందుకు తమ జట్టు మూడేళ్లుగా ఎదురుచూసిందని.. చివరికి వర్షం కారణంగా ఆ అవకాశం కూడా దక్కలేదని ఎమోషనల్‌గా స్పందించాడు.


‘బంగ్లాదేశ్‌తో మా క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ రద్దయిందని తెలిసే సమయానికి నేను టవల్‌లోనే ఉన్నాను. మైదానానికి వెళ్లే అవకాశం కూడా రాకపోవడం బాధగా ఉంది. ఓ టెస్ట్‌ దేశంతో ఆడే అవకాశం కోసం మూడేళ్లు ఎదురుచూశా. కానీ.. జరగాల్సింది అది కాదేమో. అసోసియేట్‌ క్రికెట్‌ అంటేనే ఇలాగే ఉంటుంది’ అంటూ విరాన్‌దీప్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. అసోసియేట్‌ దేశాల క్రికెటర్లకు అగ్రశ్రేణి జట్లతో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి అవకాశం వచ్చినప్పుడు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ జరగకపోవడంతో విరాన్‌దీప్‌ తన నిరాశను ఇలా వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

పసిడి పంచ్‌కు బౌట్‌ దూరంలో..

రైతు బిడ్డ.. పసిడి పంట

Updated Date - Sep 30 , 2026 | 06:53 AM