Share News

గణాంకాలు పట్టించుకోను

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:00 AM

వ్యక్తిగత రికార్డులకన్నా జట్టు విజయాలనే ఎక్కువగా ఆస్వాదిస్తానని స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తేల్చాడు.

గణాంకాలు పట్టించుకోను
Virat Kohli

గువాహటి: వ్యక్తిగత రికార్డులకన్నా జట్టు విజయాలనే ఎక్కువగా ఆస్వాదిస్తానని స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తేల్చాడు. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ బాదిన కోహ్లీ 15 వేల పరుగులు మైలురాయిని చేరడం తెలిసిందే. ‘వ్యక్తిగతంగా ఎన్ని పరుగులు చేశామనేది ముఖ్యం కాదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జట్టును గెలిపించేందుకు కృషి చేయాలి. కానీ గణాంకాల కోసమే ఆడితే ఇంతకాలం కెరీర్‌ కొనసాగేది కాదు. ఎందుకంటే రికార్డుల కోసం ప్రయత్నిస్తే మన ప్రధాన లక్ష్యం పక్కకుపోతుంది’ అని విరాట్‌ గుర్తుచేశాడు.


ఇవి కూడా చదవండి:

బంగారు భామలు

రైతు బిడ్డ.. పసిడి పంట

Updated Date - Sep 30 , 2026 | 03:00 AM