Share News

నా మొబైల్‌ ఇచ్చేయండి సైబర్‌ క్రైమ్‌కు రిజ్వాన్‌ అప్పీల్‌

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:09 AM

ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో తనపై కొనసాగుతున్న దర్యాప్తుపై మరింత స్పష్టతనివ్వాలంటూ జాతీయ సైబర్‌ క్రైమ్‌ పరిశోధనా ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ)ని పాక్‌ క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ కోరాడు.

నా మొబైల్‌ ఇచ్చేయండి సైబర్‌ క్రైమ్‌కు రిజ్వాన్‌ అప్పీల్‌
Mohammad Rizwan

కరాచీ: ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో తనపై కొనసాగుతున్న దర్యాప్తుపై మరింత స్పష్టతనివ్వాలంటూ జాతీయ సైబర్‌ క్రైమ్‌ పరిశోధనా ఏజెన్సీ (ఎన్‌సీసీఐఏ)ని పాక్‌ క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ కోరాడు. అలాగే గత నెలలో స్వాధీనం చేసుకున్న తన మొబైల్‌ ఫోన్‌ను కూడా తిరిగివ్వాలని ఆ లేఖలో తెలిపాడు. ఈనెలారంభంలో ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో పాక్‌ వైట్‌వా్‌షకు గురైంది. అయితే ఈ ప్రదర్శనపై ఆగ్రహించిన పాక్‌ బోర్డు రిజ్వాన్‌, ఇమామ్‌లతో పాటు ఏడుగురు ప్లేయర్లను సిరీస్‌ మధ్యలోనే పాక్‌కు పిలిపించింది.


ఇవి కూడా చదవండి:

పసిడి పంచ్‌కు బౌట్‌ దూరంలో..

రైతు బిడ్డ.. పసిడి పంట

Updated Date - Sep 30 , 2026 | 03:09 AM