హార్పర్ శతకం
ABN , Publish Date - Sep 30 , 2026 | 03:04 AM
లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ సామ్ హార్పర్ (101 బ్యాటింగ్) అజేయ శతకంతో అదరగొట్టాడు.
ఆసీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్ 282/7
పుదుచ్చేరి: లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ సామ్ హార్పర్ (101 బ్యాటింగ్) అజేయ శతకంతో అదరగొట్టాడు. దీంతో మంగళవారం భారత్ ‘ఎ’తో ఆరంభమైన రెండో అనధికార టెస్టులో ఆట ముగిసే సమయానికి ఆసీస్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. జేసన్ సంఘా (46), మెక్‌స్వీనీ (34), లియామ్ స్కాట్ (34), మర్ఫీ (33) రాణించారు.
భారత్ ‘ఎ’ బౌలర్ల ధాటికి ఆరంభంలో ఆసీస్ 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ముందుగా సంఘా, మెక్‌స్వీనీ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత హార్పర్ అండగా నిలిచి ఆరో వికెట్‌కు స్కాట్‌తో 84, ఏడో వికెట్‌కు మర్ఫీతో కలిసి 89 పరుగులు సమకూర్చి జట్టుకు గౌరవప్రదమైన స్కోరందించాడు. నచికేత్, ములానిలకు మూడేసి వికెట్లు దక్కాయి.
ఇవి కూడా చదవండి:
మీరేనా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్?.. పార్థివ్‌ను ఆటపట్టించిన ఆకాశ్ చోప్రా
నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం.. గిల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు