మీరేనా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్?.. పార్థివ్‌ను ఆటపట్టించిన ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Sep 29 , 2026 | 07:45 AM
టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌పై కామెంటేటర్ ఆకాష్ చోప్రా సరదాగా సెటైర్లు వేశాడు. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ స్థానంలో పార్థివ్ పటేల్‌ను నియమించే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌పై కామెంటేటర్ ఆకాష్ చోప్రా సరదాగా సెటైర్లు వేశాడు. ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ స్థానంలో పార్థివ్ పటేల్‌ను నియమించే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కోచింగ్ బాధ్యతల్లో పనిచేసిన పార్థివ్ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
ఓ మ్యాచ్‌కు కామెంట్రీ ఇస్తున్న సమయంలో పార్థివ్‌తో ఆకాష్ చోప్రా సరదాగా సంభాషించాడు. ‘మీకు ఏ పాత్ర బాగా సరిపోతుంది? ఇప్పటికే పూర్తయిన పాత్రా? లేక భవిష్యత్‌లో రాబోయే పాత్రా?’ అంటూ పార్థివ్‌ను పరోక్షంగా ప్రశ్నించాడు. చోప్రా ప్రశ్నకు పార్థివ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘నేను వర్తమానాన్ని నమ్ముతాను. క్రికెట్ ఆడే రోజుల్లో కూడా నాకు అదే నేర్పించారు. గతంలో జరిగింది ఇక మన చేతుల్లో లేదు. భవిష్యత్‌లో వచ్చేదాని గురించి కూడా ఆలోచించకూడదు. ఒక్కో బంతిని ఒక్కోసారి ఎదుర్కోవాలి. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. ప్రస్తుతం నాకు కామెంటరీనే ఎక్కువగా నచ్చుతోంది. చాలా సరదాగా గడుపుతున్నా’ అని పార్థివ్ సమాధానం ఇచ్చాడు.
ఇంతటితో ఆగని ఆకాష్ చోప్రా.. మాజీ టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌ను కూడా సంభాషణలోకి తీసుకొచ్చాడు. ‘ఈరోజు మనం పార్థివ్‌కు మంచి స్నేహితులం. రేపు ఇలాగే ఉంటామో లేదో తెలియదు. కాలం మారిపోయింది కదా.. ఇప్పుడు ముందే అన్నీ నిర్ణయించుకుంటున్నారు’ అంటూ నవ్వించాడు. దీనిపై అభిషేక్ నాయర్ కూడా సరదాగా స్పందించాడు. పార్థివ్‌కు ప్రతిభను గుర్తించడంలో, ఆటగాళ్ల ఎంపికలో మంచి అవగాహన ఉందని ప్రశంసించాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు భారత్
కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్