Share News

కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్

ABN , Publish Date - Sep 28 , 2026 | 09:56 AM

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ గిల్ కూడా కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిని అలా వదిలేస్తేనే జట్టుకు సులువుగా విజయాన్ని అందిస్తాడని వెల్లడించాడు.

కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 139 పరుగులతో అజేయ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(110)తో కలిసి ఏకంగా 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 296 పరుగుల లక్ష్యాన్ని 41.4 ఓవర్లలో ఛేదించి జట్టుకు ఘన విజయం అందించాడు. ఈ క్రమంలో కెప్టెన్ గిల్ కూడా కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


‘విరాట్ కోహ్లీ దేశం కోసం ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన గొప్ప ప్లేయర్. ఈరోజు కూడా అదే చేశాడు. అలాంటి ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు.. అతడు ఎలా ఆడాలనుకుంటే అలా ఆడనివ్వాలి. ఎందుకంటే కోహ్లీ బాగా ఆడితే మ్యాచ్ మనదే. చాలా సులువుగా మ్యాచ్‌లు గెలిపించేస్తాడు. కోహ్లీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే ప్రస్తుతం టీమిండియా వ్యూహం’ అని గిల్ వివరించాడు.


ఎనిమిదో స్థానం వరకు..

2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా కూర్పుపై గిల్‌ దృష్టి పెట్టాడు. టాపా‌ర్డర్‌లో కోహ్లీ, రోహిత్‌ వంటి అనుభవజ్ఞులు ఉన్నప్పటికీ.. జట్టుకు 8వ స్థానంలోనూ బ్యాటింగ్‌ చేయగల ఆటగాడు అవసరమని గిల్‌ పేర్కొన్నాడు. ‘మాకు ఎనిమిదో స్థానంలోనూ బ్యాటింగ్‌ చేయగల ఆటగాడు ఉండాలని కోరుకుంటున్నాం. అతడు 25-30 పరుగులు చేయగలిగినా అది జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఆశించిన స్కోర్లు చేయలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే 8వ స్థానం మాకు కీలకం. వేర్వేరు కాంబినేషన్లను ప్రయత్నించి ఏది పనిచేస్తుందో చూడటానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని గిల్‌ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

POTM అవార్డు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది: కుల్‌దీప్ యాదవ్

భారత్ తరఫున ఆడే ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నా: విరాట్ కోహ్లీ

Updated Date - Sep 28 , 2026 | 09:56 AM