Share News

మెస్సి మ్యాజిక్.. అసాధ్యం అనుకున్నారు.. కానీ! వీడియో వైరల్

ABN , Publish Date - Sep 28 , 2026 | 08:48 AM

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ఇంటర్ మయామి తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న మెస్సి.. కొలంబస్ క్రూతో జరిగిన మేజర్ లీగ్ సాకర్ మ్యాచ్‌లో అద్భుతమైన ఫ్రీ కిక్‌తో గోల్ చేశాడు.

మెస్సి మ్యాజిక్.. అసాధ్యం అనుకున్నారు.. కానీ! వీడియో వైరల్
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. ఇంటర్ మయామి తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న మెస్సి.. కొలంబస్ క్రూతో జరిగిన మేజర్ లీగ్ సాకర్(MLS) మ్యాచ్‌లో అద్భుతమైన ఫ్రీ కిక్‌తో గోల్ చేశాడు. అత్యంత ఇరుకైన కోణం నుంచి మెస్సి కొట్టిన ఫ్రీ కిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మ్యాచ్‌లో కొలంబస్‌ క్రూ తొలుత ఆధిక్యంలోకి వెళ్లింది. 28వ నిమిషంలో జోసెఫ్‌ మార్టినెజ్‌ పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే కేవలం ఐదు నిమిషాలకే మెస్సి తన మార్కు చూపించాడు. గోల్‌పోస్ట్‌కు కుడి వైపున అత్యంత ఇరుకైన కోణంలో లభించిన ఫ్రీ కిక్‌ను నేరుగా గోల్‌పోస్ట్‌ వైపు పంపించాడు. బంతి అద్భుతంగా నెట్‌లోకి దూసుకెళ్లడంతో గోల్‌కీపర్‌తో పాటు మైదానంలోని మెస్సి సహచరులు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఇంటర్‌ మయామి 1-1తో స్కోరు సమం చేసింది. ఈ గోల్‌తో మెస్సి ఈ సీజన్‌లో తన రెగ్యులర్‌ సీజన్‌ గోల్స్‌ సంఖ్యను 21కి పెంచుకున్నాడు. ఈ గోల్ వైరల్ అవుతుండటంతో అభిమానులు ‘ఇది అసాధ్యం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇంటర్ మయామి ఓటమి..

మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందని అంతా భావించిన సమయంలో కొలంబస్‌ క్రూ చివరి నిమిషాల్లో గోల్‌ చేసింది. స్టాపేజ్‌ టైమ్‌లో బ్రైస్‌ మెండెజ్‌ బాక్స్‌ అంచు నుంచి అద్భుతమైన కర్లింగ్‌ షాట్‌ కొట్టాడు. మయామి గోల్‌కీపర్‌ రోకో రియోస్‌ నోవో దాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయాడు. అదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సెనెగల్‌ ఆటగాడు జమాల్‌ థియారే వెంటనే స్పందించి బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో కొలంబస్‌ 2-1తో విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

POTM అవార్డు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది: కుల్‌దీప్ యాదవ్

భారత్ తరఫున ఆడే ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నా: విరాట్ కోహ్లీ

Updated Date - Sep 28 , 2026 | 08:48 AM