Share News

నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం.. గిల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 07:00 AM

భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెరీర్‌పై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు.

నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం.. గిల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెరీర్‌పై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు. ఇప్పుడు అతడు నాయకత్వ బాధ్యతల్లో ఉన్నాడని, తాను సీనియర్ ఆటగాడిని అంటూ వెల్లడించాడు. గిల్‌కు జట్టును ఎలా నడిపించాలనే విషయంపై ఒక క్లారిటీ ఉందని తెలిపాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డే అనంతరం కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.


‘గిల్‌కు క్రికెట్ కెరీర్‌లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. వ్యక్తిగత మైలురాళ్లు చూసుకుంటే ముందుకు సాగలేం. అది జట్టు విజయాలపై ప్రభావం చూపుతుంది. గిల్‌తో మొదటి నుంచీ సరదాగా, స్వేచ్ఛగా మాట్లాడుతుంటాను. ఇప్పుడు అతడు నాయకుడి స్థానంలో ఉన్నాడు. నేను కూడా చాలాకాలం ఆ బాధ్యతలు నిర్వర్తించాను. ఇప్పుడు జట్టులో ఒక సీనియర్ ప్లేయర్‌గా ఉన్నాను. సీనియర్ ఆటగాళ్లు, కెప్టెన్ నవ్వుతూ, సరదాగా ఉంటే మిగతా ఆటగాళ్లలోనూ ఒత్తిడి తగ్గుతుంది. ఎంతటి క్రిటికల్ మ్యాచ్ అయినా అందరూ ప్రశాంతంగా ఆడగలుగుతారు. మైదానంలో మాత్రం పూర్తి ప్రొఫెషనల్‌గా ఉంటాం.


‘గిల్‌తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మ్యాచ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఇష్టపడం. ఇతర విషయాలే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అతడికి ఏం చేయాలో తెలుసు.. నాకు ఏం చేయాలో తెలుసు. అతను కొన్ని షాట్లు ఆడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుభవం ఆధారంగా అవసరమైతే కొన్ని సూచనలు ఇస్తాను. అయితే మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కువగా చర్చించుకుంటాం. కెప్టెన్‌గా గిల్‌పై చాలా బాధ్యతలు ఉంటాయి. అతడితో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడికి ఆటపై మంచి అవగాహన ఉంది. జట్టును ఎలా గెలిపించాలనే దానిపై సరైన దృక్పథం ఉంది. అందుకే అతడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు’ అని కోహ్లీ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు భారత్

కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్

Updated Date - Sep 29 , 2026 | 07:00 AM