Share News

అక్టోబర్‌ 1న క్యాబినెట్‌ భేటీ?

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:57 AM

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్‌ 1న జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు కరువు భత్యాల (డీఏ) ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.

అక్టోబర్‌ 1న క్యాబినెట్‌ భేటీ?
Telangana governmant

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అక్టోబర్‌ 1న జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు కరువు భత్యాల (డీఏ) ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. దసరా పండుగ నుంచి అమలు చేయనున్న ఈ రెండు డీఏల వల్ల ఖజానాపై పడే భారం, నిధుల సర్దుబాటుపై అధికారులు క్యాబినెట్‌కు వివరించనున్నారు.


అనంతరం దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించిన ధరణి, 22-ఏ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది.

Updated Date - Sep 30 , 2026 | 06:57 AM